FbTelugu

14నుంచి శ్రీశైల మల్లన్న దర్శనాలు

కర్నూలు: శ్రీశైల దేవస్థానం లో ఆగస్టు 14 నుండి దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ కేఎస్.రామారావు తెలిపారు.

శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు,సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ ఈఓ తెలిపారు. భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన సూచించారు.

You might also like