FbTelugu

పాల ధర తగ్గింపు హామీ అమలు

చెన్నై: తమ పార్టీ అధికారంలోకి వస్తే పాల ధరను తగ్గిస్తామని హామీ ఇచ్చిన డిఎంకె అధినేత ఎంకె.స్టాలిన్ ఆ ప్రకారంగానే పాల ధరలను తగ్గించారు. తమిళనాడులో అదివారం నుంచి తగ్గించిన ధరలు అమలు చేశారు.

నెలవారి పాల కార్డులుకలిగిన వారికి లీటర్ కు రూ.3 చొప్పున తగ్గించారు. తగ్గించిన దాని ప్రకారం బ్లూ రంగు ప్యాకెట్ పాలు లీటర్ రూ.37, అర లీటర్ రూ.18.30, గ్రీన్ ప్యాకెట్ అరలీటర్ రూ.21, ఆరెంజ్ ప్యాకెట్ పాలు రూ.23, పింక్ ప్యాకెట్ పాలు అరలీటర్ రూ.18 చొప్పున విక్రయించారు. ఇవే కాకుండా అవిన్ బ్లూ రంగు ప్యాకెట్ పాలు లీటర్ రూ.40, అర లీటర్ రూ.20, గ్రీన్ ప్యాకెట్ పాలు అర లీటర్ రూ.22, ఆరెంజ్ ప్యాకెట్ పాలు రూ.24, పింక్ ప్యాకెట్ అరలీటర్ రూ.18.50కి విక్రయించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో బిజెపి మద్దతిచ్చిన ఏఐఏడిఎంకె ప్రభుత్వం పాల ధరలను పెంచుకుంటూ పోయిందని, స్టాలిన్ ప్రభుత్వం అందరికీ మేలు కలిగే విధంగా పాల ధరలను తగ్గించిందని అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.