FbTelugu

ఫ్లెమింగో ల రాక… కాని చూడలేము!

నిజామాబాద్: ప్రతి వేసవికాలంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వెనకాల ఫ్లెమింగో పక్షలు సందడి చేస్తాయి. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా ఏప్రిల్ లో విదేశీ పక్షలు వచ్చాయి కాని వీక్షించలేని పరిస్థితి ఉంది.
నందిపేట మండల పరిధిలోని శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఆఫ్రికా, సైబిరాయా దేశాలకు చెందిన ఫ్లెమింగో జాతి పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తమకు నచ్చిన ప్రాంతంలో ఇవి ఎగురుతూ గడుపుతున్నాయి. గంగాగద్దే, నడకుడ, నిఖాలపూర్, నూత్ పల్లి, సిర్పూర్, ఉమ్మెడ గ్రామాల్లో గడ్డి పొదలు గుబురుగా ఉన్నాయి.

గడ్డి పొదల్లో ఇవి తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వీటితో పాటు కృష్ణ జింకలు కూడా సంచరిస్తున్నాయి.
రాత్రిపూట 600 కిలోమీటర్లకు పైగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేసే ఫ్లెమింగో పక్షులు పగటి పూట నీటిలో సేదతీరుతాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోనే ఉండిపోతాయి. వానలు ప్రారంభం కాగానే పక్షులతో పాటు జింకలు కూడా తమ స్వస్తాలకు వెళ్లిపోతాయి. జింకలు మాత్రం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా అటవీ ప్రాంతానికి తరలిపోతాయి. కరోనా వైరస్ కారణంగా అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతానికి పర్యాటకులను అనుమతించడం లేదు. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టామని, ప్రజలు కూడా సహకరించాలని నందిపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.