FbTelugu

కిషోర్ ను కర్నూలుకు తీసుకెళ్లడంలో ఉద్దేశమేంటీ: గంటా

అమరావతి: నలంద కిషోర్ ను కర్నూలుకు తీసుకెళ్లడంలో ఉద్దేశమేంటని గంటా శ్రీనివాస్ అధికారులను ప్రశ్నించారు. ‘నన్ను టార్గెట్ చేయండి. కానీ నా స్నేహితుడు నలంద కిషోర్ ను ఇరికించడం దేనికి’ అంటూ ప్రశ్నించారు.

పోస్టు ఎవరు క్రియేట్ చేశారో వారిపై చర్యలు తీసుకోండని అన్నారు. కేవలం ఫార్వార్డ్ చేసిన వారిని టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. ఈ సమస్యను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని అన్నారు.

You might also like