FbTelugu

స్టీలు ప్లాంట్ ను ప్రైవేటుపరం కానివ్వం: శారదా పీఠం

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఏపీ, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కాపాడుకోవాలని ప్రజల్లో మనస్సుల్లో బలంగా ఉన్నందున ఈ సంస్థను ప్రైవేటుపరం కానివ్వం అని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్.కె బీచ్ వద్ద మాజీ ఎంపీ టీ.సుబ్బరామిరెడ్డి, శ్రీ లలిత కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి హాజరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.