FbTelugu

భద్రాద్రిలో 21న శ్రీరామ నవమి

భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణం ఈనెల 21వ తేదీన సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. ఈనెల 27 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది సిద్దం చేశారు. కరోనా వైరస్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 21న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద నిర్వహించనున్నారు. 22న మహాపట్టాభిషేకం కూడా అదే వేదికలో జరగనుంది. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేశారు. అలాగే 17 నుంచి 27 వరకు దర్బారు సేవలను, ఈనెల 17 నుంచి మే 4 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు. కల్యాణానికి రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు సిఎం కెసిఆర్ కు ఆహ్వాన పత్రికను అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.