FbTelugu

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శ‌నివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకి పై మోహినీ అవతారంలో అభయమిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.
సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు.

అందులో విషంతోపాటు అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించ‌డం జరిగింది. ఆ తరువాత ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు గ‌రుడ‌వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.