FbTelugu

రెండు నగరాల్లో స్పుత్నిక్ వ్యాక్సినేషన్ షురూ

హైదరాబాద్: రాష్ట్రంలో మరో కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం పలు కేంద్రాలలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఇస్తుండగా, దాని సరసన మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్-వి చేరింది.

హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో స్పుత్నిక్-వి సాఫ్ట్ లాంచ్ ను ప్రారంభించారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కు చెందిన ఉద్యోగి అశోక్ మొదటి డోస్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్టును డాక్టర్ రెడ్డీస్ సిఈఓ ఎంవి.రమణ, అపోలో గ్రూపు వైస్ ప్రెసిడెంట్ డా.కె.హరిప్రసాద్ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఏకకాలంలో ప్రారంభించగా, ఇందులో భాగంగా మొత్తం 50వేల మందికి ప్రయోగాత్మకంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.