FbTelugu

మే 1 స్పుత్నిక్-వి వ్యాక్సిన్ దిగుమతి

మాస్కో: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తొలి బ్యాచ్ మే 1న భారతదేశానికి పంపిస్తున్నామని రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అత్యవసర వినియోగం కోసం స్పుత్నిక్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దేశంలో సరఫరా చేసేందుకు ఐదు భారతీయ కంపెనీలతో రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ఒప్పందం చేసుకున్నది కూడా. అందులో రెడ్డీస్ ల్యాబ్ ఒకటి. సంవత్సరానికి 850 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయనున్నారు. ఈ వేసవిలో వ్యాక్సిన్ల ఉత్పత్తి 50 మిలియన్ డోసులకు చేరుకోనున్నదని, క్రమంగా పెంచుతామని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.