FbTelugu

స్పుత్నిక్ వి ఒక్క డోసు రూ.995

హైదరాబాద్: స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఒక్క డోసు రూ.995 చొప్పున అందచేస్తామని, జూన్ నుంచి అందుబాటులోకి వస్తుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. తొలుత 35 నగరాలు, పట్టణాలను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వ్యాక్సిన్ సరఫరాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం 18 డిగ్రీల సెల్సియస్ లో భద్రపర్చాల్సి ఉండడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందు కోసం ఈ స్టోరేజి సదుపాయం ఉన్న ఆసుపత్రులతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చర్చలు జరిపింది. ప్రయోగాత్మక పరిశీలన కోసం స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను హైదరాబాద్ లో లాంఛనంగా విడుదల చేశారు. వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడం మూలంగా ధర అధికంగా ఉందని, ఇక్కడే తయారు చేస్తే తగ్గే అవకాశం ఉంది. స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఆరు కంపెనీలతో చర్చలు జరిపి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ పై రష్యాలో పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇమ్యనోజెనిసిటి, సెఫ్టీకి సంబంధించిన డేటాను రెడ్డీస్ ల్యాబ్ సమర్పించింది. లైట్ వ్యాక్సిన్ విడుదల చేయడానికి జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం, డిసిజిఐతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ కు రష్యాలో 79.4 సమర్థత వచ్చిందని రెడ్డీస్ ల్యా సీఈఓ దీపక్ సప్రా తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే డబుల్ డోసు వేసుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ డోసు వేసుకుటే సరిపోతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.