FbTelugu

డెల్టా వైరస్ పై బూస్టర్ వచ్చింది: గమలేయా

మాస్కో: కరోనా ఫస్ట్ వేయావ్ లో ఎంతగా భయపడ్డామో… అంతకన్నా ఎక్కువగా సెకండ్ వేవ్ లో వణికిపోయాం. కాని డెల్టా రకం వైరస్ అత్యంత దారుణంగా ఉంటుందని వార్తలొస్తున్న నేపథ్యంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తీపి కబురు అందించింది.

ఇండియాలో సెకండ్ వేవ్ కు డెల్టారకం వైరస్ (బి.1.617.2) కారణమని తేలడంతో రష్యాకు చెందిన గమలేయా రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏపిడమాలజీ అండ్ మైక్రో బయాలజి పరిశోధనలు మొదలు పెట్టి పూర్తి చేసింది. దీని కోసం ప్రత్యేకంగా బూస్టర్ డోస్ ను తయీరు చేసింది. బూస్టర్ డోసు ను ఇతర వ్యాక్సిన్ తయారీదారులకు సైతం అందిస్తామని గమలేయా ప్రకటించింది. ఈ రకం వైరస్ ను తొలుత ఇండియాలోనే గుర్తించారు. ఆ తరువాత ఇతర దేశాలకు పాకింది. ప్రస్తుతం బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పౌరులను హడలెత్తిస్తున్నది.

ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లతో పాటు స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు కూడ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తన ఉద్యోగులకు స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నది. జూలై 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున మార్కెట్ లోకి పంపిణీ చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.