FbTelugu

త్వరలో స్పుత్నిక్ సింగిల్ డోస్: రష్యా రాయబారి

న్యూఢిల్లీ: స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను త్వరలోనే ఇండియాలో విడుదల చేస్తామని రష్యా దేశం రాయబారి ఎన్ కుడషేవ్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ దిగుమతి అయ్యిందని, వచ్చేవారం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.

స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రష్యన్-ఇండియన్ వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. దేశంలో దశలవారీగా ఉత్పత్తి పెంచుతామని, ఏటా 85 కోట్ల డోసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్పత్నిక్-వి డబుల్ డోస్ వ్యాక్సిన్ కాగా స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ అన్నారు. గత ఏడాది ద్వితియార్థం నుంచి రష్యాలో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వచ్చిందని, ఇండియాలో ఇటీవలే అనుమతించారన్నారు. నూతన స్ట్రేయిన్ వైరస్ లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నదని రాయబారి ఎన్ కుడషేవ్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.