FbTelugu

ఇండియాలో స్పుత్నిక్ ప్రయోగాలు షురూ

హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకురావడంలో మేమే నెంబర్ వన్ అని ప్రచారం చేసుకున్న రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రయోగాలు ఇండియాలో మొదలయ్యాయి. రెండు, మూడు దశలను ప్రయోగించేందుకు సన్నద్దమయ్యారు.
ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ లాబోరేటరీ నుంచి అనుమతులు పొందారు. జేఎస్ఎస్ మెడికల్ రీసెర్చి భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలు నిర్వహిస్తుండగా, భారత బయోటెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రిసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ తో కలిసి పనిచేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. దేశంలో ప్రయోగాలు చేపట్టడంతో పాటు 10 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు ఎంఓయు కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

రెండో దశలో వంద మందిపై, రెండో దశలో 1400 మందిపై ప్రయోగాలు చేసేందుకు వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. రష్యాలో ఈ వ్యాక్సిన్ 91.4 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. వీటిని సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్) మధ్యే నిల్వ చేసుకునే వీలుంది. రాష్యాలో దేశ పౌరులందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించిన రష్యా ప్రభుత్వం బయటి దేశాలకు మాత్రం ఒక డొసు ను 10 డాలర్ల చొప్పున విక్రయించనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలంటే కనీసం 20 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.