FbTelugu

కరోనాతో మిల్కా సింగ్ మృతి

న్యూఢిల్లీ: మిల్కా సింగ్ జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, వాటికి ఎదురొడ్డి దేశంలోనే అత్యుత్తమ స్ప్రింటర్ గా ఎదిగారు. ఆయన జీవితం ఎందరికో ప్రేరణాత్మకంగా మారింది.

కరోనా పాజిటివ్ సోకిన మిల్కా సింగ్ (91) శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ శరణార్థి శిబిరంలో బాల్యాన్ని గడిపిన ఆయన చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ బతుకు జీవితాన్ని నెట్టుకువచ్చారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకుని పలుమార్లు ప్రయత్నించాడు. అతని నైపుణ్యాన్ని గమనించి స్ప్రింటర్ గా తీర్చిదిద్దారు. 1958 లో కామన్ వెల్త్ గేమ్స్ లో మెడల్ గెలుపొందాడు. 1960 లో రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. కేవలం ఒకే ఒక సెకన్ తో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. ఏషియన్ గేమ్స్ లో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. రోమ్ లో ఆయన నెలకొల్పిన రికార్డు 38 ఏళ్ల పాటు జాతీయ రికార్డుగా మిగిలిపోయింది. దేశంలోని లక్షలాది మంది క్రీడాకారులకు ప్రేరణగా నిల్చిన మిల్కా సింగ్ కు 1959 లోనే పద్మశ్రీ అవార్డు దక్కింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.