FbTelugu

అమూల్‌ కేసులో హైకోర్టు లో చుక్కెదురు

అమరావతి: గుజరాత్ కు చెందిన అమూల్ తో ఏపి ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం పై వివరాలు అందచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు అమూల్ పై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని ఆదేశించింది.

అమూల్‌తో ఏపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ వైసిపి ఎంపి కె.రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లోని అమూల్‌ సంస్థతో పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఒప్పందం పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్‌, నేషనల్ డెయిరీ బోర్డును కోర్టు ఆదేశిస్తూ, కేసు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.