FbTelugu

భారత్ బయోటెక్ కు బాబు అండ్ కో భజన: జోగి రమేష్

తాడేపల్లి: భారత్ బయోటెక్ కు ఏజెంట్లుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యవహరిస్తున్నదని వైసిపి ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రంగా విమర్శించారు.
కోవాగ్జిన్ ఫార్ములాను విస్తృతపరచాలని గొప్ప మనసుతో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాస్తే చంద్రబాబు, ఆయన మీడియాకు ఉలుకెందుకు..? అని నిలదీశారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం, అనుభవం ఉన్న మిగతా సంస్థలకు కూడా పంచాలని జగన్ కోరారన్నారు. త్వరితగతిన అందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు సహకరించాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలనే గొప్ప మనసుతో జగన్ ప్రధానికి లేఖ రాస్తే, చంద్రబాబు, టిడిపికి ఉలుకెందుకున్నారు. వారి అనుకూల ఎల్లో మీడియా ఎందుకు హైరానా పడిపోతున్నదని ఆయన ప్రశ్నించారు. భారత్ బయోటెక్ మీ బంధువులదో, మీ కమ్మ కులానికి చెందిన సంస్థ అయినంత మాత్రాన.. ఆ సంస్థ పేటెంట్ ఎందుకు వదులుకోవాలని చంద్రబాబు దగ్గర నుంచి ఈనాడు రామోజీ రావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టివి 5 బిఆర్.నాయుడులు తెగ బాధపడిపోతున్నారని జోగి రమేష్ అన్నారు. వీరి దుష్ప్రచారం చూస్తుంటే ప్రజల ప్రాణాల కన్నా, తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తూ… ఆ కంపెనీకి ఏజెంట్లుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని జోగి రమేష్ మండి పడ్డారు.

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ మీ బంధువులది అయినంత మాత్రాన, ఈనాడు అధినేత చెరుకూరి రామోజీ రావు కొడుకు కిరణ్ వియ్యంకుడిదైనంత మాత్రాన, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, టివి 5 అధినేత బొల్లినేని రవీంద్రనాథ్ నాయుడు కులానికి చెందిన వ్యక్తిది అయినంత మాత్రాన.. వీళ్ళంతా దానికి ఏజెంట్లుగా మారిపోయారా..? అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే.. మన రాష్ట్రానికే చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఎన్నోమహమ్మారి వ్యాధులకు మందులు కనిపెట్టి, అప్పట్లో కొన్ని లక్షల మందికి ఉచితంగా ప్రాణదానం చేశారు. ఫ్లేగు వ్యాధితో చనిపోతుంటే.. దానికీ ఔషధాన్ని కనిపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడారు. తప్పితే.. ఫార్ములాకు హక్కుల కోసం ఆశపడలేదు. వాటికి పేటెంట్ కంటే మానవాళి రక్షణే తనకు ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. అలాంటి మహానుభావులను కమ్మ కులానికి చెందిన మీడియా సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని జోగి రమేష్ అన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా కంపెనీని అడ్డం పెట్టుకుని తామే కోట్లు సంపాదించాలని, తమ కమ్మ కులం వారే బాగుపడాలని చూస్తున్నారు. వీళ్ళ ఆలోచన- ఎంతసేపటికీ శవాల మీద డబ్బులు ఏరుకోవాలి. చావుల మీద వేలాది కోట్ల రూపాయలు సంపాదించాలి అనే ధ్యాస ఉందని జోగి రమేష్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.