FbTelugu

ఆధ్యాత్మికవేత్త అచ్యుతానందగిరి స్వామి దారుణహత్య

చిత్తూరు: ఆధ్యాత్మికవేత్త అచ్యుతానందగిరి స్వామి(65)ని గుర్తుతెలియని దుండగుడు అతి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని ఐరాల మండలం, గుండ్లపల్లె సమీపంలోని శ్రీరామతీర్థ సేవాశ్రమంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామతీర్థ సేవాశ్రమాన్ని దాదాపు 60 యేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కాగా అచ్యుతానందగిరి స్వామి దీని బాధ్యతలను 40 ఏళ్లుగా చూసుకుంటున్నారు.

ఆశ్రమంలోని శివాలయంలో నిత్యం పూజలు చేసేవారు.  లక్ష్మమ్మ అనే వృద్ధురాలు సహాయకారిగా ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ దుండగుడు ఆశ్రమంలోకి ప్రవేశించి అచ్యుతానందగిరి స్వామిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై అచ్యుతానందగిరి స్వామి అన్న శ్రీరాములురెడ్డి పలు విషయాలు వెల్లడించారు. తన తమ్ముడు పూతలపట్టు మండలం మిట్టూరు వద్ద ఇటీవల ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడని, విక్రయించిన వ్యక్తి ఇప్పటివరకు దానిని అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతడే దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.