FbTelugu

జర్నలిస్టులకు ప్రత్యేక ఆస్పత్రులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. కరోనా కష్ట కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించనున్నట్లు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇందుకు గానూ.. నోడల్ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించినట్లు తెలిపింది.

You might also like