FbTelugu

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొనడంలో భాగంగా నగరానికి వచ్చారు.

భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ అనంతరం వారాసిగూడకు బయలుదేరారు. నగరంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. అమిత్ షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, తదితర ప్రముఖ నాయకులు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.