FbTelugu

గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఒక స్పెషల్ వీడియో

ప్రేక్షకులను, సినీ అభిమానులను ఆకట్టుకునేందుకు దర్శక, నిర్మాతలు ఎంత ఖర్చుకైనా వెనకాడ్డం లేదు. క్వాలిటీ లో రాజీ లేకుండా సినిమాలు తీస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర నిర్మాత కూడా ఖర్చుకు వెనక అడుగు వేయకుండా డబ్బులు పెడుతున్నాడు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్ గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

రోమియో ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైపు కాదంటూ హీరో ప్రభాస్ చెప్పిన డైలాగ్ విని అభిమానులు ఆనందపడిపోతున్నారు. వింటేజి స్టైల్లో ఉన్న వీడియో, పురాతన కాలం నాటి రైల్వే స్టేషన్, ప్రభాస్ డ్రెస్సింగ్ ఆకట్టుకుంటున్నది. కేవలం ఈ సెట్ కోసం నిర్మాత రూ.1.6 కోట్లు వెచ్చించాడంట. ఈ సెట్ కోసం 250 మంది నిపుణులు నెల రోజుల పాటు కష్టపడి రూపొందించారు. ఇటలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇలాంటి ఎన్నో సెట్ లు ఉన్నాయని, పురాతన ఇటలీ శైలి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.