FbTelugu

రేపటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: రేపటి నుంచి (జూన్ 01) ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. 4 రోజుల ముందునుంచే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. రిజర్వేషన్ లేని వారిని స్టేషన్ లోనికి అనుమతించమని తెలిపారు. ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్ కు చేరుకోవాలని సూచించారు.

టికెట్ ఉన్నవారికి మొదట థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించిన తర్వాతనే స్టేషన్ లోకి పంపిస్తారు. ప్రతి ప్రయాణికుడూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి అనుమతి లేదని తెలిపారు.

You might also like