FbTelugu

పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

హైదరాబాద్‌: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరగనున్న నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీ ఎక్కువగా ఉండే ఆయా మార్గాల్లో అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోందని తెలపింది.

దీనికి సంబంధించిన వివరాలను తాజాగా రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. ఈనెల 10 నుంచి ప్రతి రోజు విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ(08519), విశాఖపట్నం-కాచిగూడ(08561), కాచిగూడ-విశాఖపట్నం(08562), ముంబై ఎల్‌టీటీ-విశాఖపట్నం(08520) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.