FbTelugu

నకిలీ పాస్ పోర్టులపై విచారణకు ప్రత్యేక బృందాలు

హైదరాబాద్: నకిలీ పాస్ పోర్ట్ స్కాం పై సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ కార్డు పొందడంలో ఉన్న లోపాల పై అధికారులకు లేఖ రాయాలని నిర్ణయించారు.
ఒకే అడ్రస్ పై 32 పాస్ పోర్టులు జారీ అయితే ఏ ఒక్క ప్రభుత్వ విభాగం కూడా గుర్తించకపోవడం నిఘా సంస్థల వైఫల్యంగా నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. బంగ్లాదేశ్ కు చెందిన కొందరు నకిలీ దృవీకరణ పత్రాలు పొంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇలా పలువురు పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించి నకిలీ గుర్తింపు కార్డులు పొందుతున్నారు. అక్కడ ఆధార్ కార్డులు తీసుకుని చేంజ్ అప్ అడ్రస్ పేరుతో తెలంగాణలోని బోధన్ కు చేసుకున్నారు

బోధన్ లో పోలీసులను మచ్చిక చేసుకుని పాస్ పోర్టులు తీసుకున్నారు. దేశ భద్రతకు సంబంధిచిన అంశం కావడంతో ఈ వ్యహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలా నకిలీ ధృవ పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్న 72 మందిలో 19 మంది దేశం వదిలి వెళ్లినట్లు గుర్తించారు. మిగతావారు ఎక్కడ ఉన్నారు..? అనేది ఇంకా బయట పడలేదు. బోధన్ లో ఒక అడ్రస్ పైన 37 పాస్ పోర్టులు తీసుకున్నట్లు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.