FbTelugu

అడ్వకేట్ల మర్డర్ కేసుపై ప్రత్యేక బృందం విచారణ

రామగుండం: అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్యకేసులో ఎంతటివారున్నా వదలబోమని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ హత్యకేసును హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేస్తోందని ఆయన వివరించారు.

పోలీసులు ఎవరికీ చుట్టాలు కాదని, చెప్పినట్లుగా వినేవాళ్లు కూడా కాదని ఆయన అన్నారు. అడ్వకేట్ల హత్యకేసులో బిట్టు శ్రీను పాత్ర ఉందని తేల్చింది తామేనని ఆయన పేర్కొన్నారు. అతని వెనుక ఎవరున్నా విచారిస్తామని, ఎవరినీ కాపాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. హత్యకు ముందు నిందితులకు బిట్టు శ్రీను కాల్ చేసింది కూడా వాస్తవమేనన్నారు. నిందితుల ఐదునెలల కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, ఏ ఒక్క ఆధారం దొరికినా వదిలిపెట్టమన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు

You might also like

Leave A Reply

Your email address will not be published.