FbTelugu

13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటు

అమరావతి: కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు చేశారు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్నారు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించనున్నారు.
ఇందు కోసం జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు అందచేయనున్నారు. ప్రత్యేక జైలు నుంచి ఖైదీలు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్ వ్యక్తులను వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించేలని పేర్కొంది. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్‌ అధికారితో పాటు.. పారా మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం తన ఆదేశంలో పేర్కొంది.

You might also like