FbTelugu

ట‌చ్‌లో ఉండామంటున్న కొండా క‌పుల్స్‌!

ఓడ‌లు బండ్లు కావ‌టం అంటే ఏమిటో కొండా దంప‌తుల‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. కొద్దిపాటి ఎమోష‌న్ ఏకంగా పార్టీను మార్చేలా చేసింది. అదే త‌ప్పు.. ఇప్పుడు ఎటూపాలుపోని స్థితిలోకి నెట్టేసింది. కొండా సురేఖ‌, ముర‌ళీ అంటే వ‌రంగల్‌రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌లు. తెర వెనుక నుంచి ముర‌ళీ చక్రం తిప్పితే సురేఖ అన్నీతానై ఆచ‌రిస్తుంది. ప‌ర‌కాల నియోక‌వ‌ర్గంలో వారికి తెలియ‌కుండా ఏమీ జ‌ర‌గ‌ద‌నేంత‌గా వారి హ‌వా సాగింది. అందాకా ఎందుకు.. వైఎస్ మ‌ర‌ణించాక‌.. ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి జ‌గ‌న్ వెంట న‌డిచారు. రాష్ట్ర ఉద్య‌మంలో కూడా జ‌గ‌న్‌ను అంటిపెట్టుకున్నారు. కానీ.. ఆ త‌రువాత స‌మీక‌ర‌ణ‌లు మార‌టంతో గులాబీగూటికి చేరారు.

నియోజ‌క‌వ‌ర్గం మార్చినా గెలిచిచూపించారు. కానీ.. య‌ర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌తో పొస‌గ‌క ఇబ్బందిప‌డ్డారు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మ‌యంలో సీట్ల పంపిణీలో కేసీఆర్ జాప్యం చేయ‌టంతో అల‌క‌బూనారు. రేవంత్‌రెడ్డి మంత‌నాల‌తో కాంగ్రెస్ గూటికి అంటే.. సొంత‌పార్టీలోకి చేరారు. కానీ.. కేసీఆర్ హవాలో కాంగ్రెస్ కుదేలైంది. దాంతోపాటుగానే కొండా దంప‌తులు కూడా ఓట‌మి చ‌విచూశారు. మ‌రోవైపు య‌ర్ర‌బెల్లి వ‌రంగల్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. దీంతో తిరిగి పూర్వ‌వైభ‌వం సాధించేందుకు కొండాదంప‌త‌లు ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌లోని అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లార‌ట‌. మీకు మేమున్నామంటూ ధైర్యాన్నిస్తున్నార‌ట‌. రాబోయే వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నికల్లో త‌మ స‌త్తా చాటి.. అవ‌కాశం చిక్కితే.. వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ మేయ‌ర్ పీఠం దక్కించుకోవాల‌నే వ్యూహంలో ఉ్నార‌ట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.