FbTelugu

ఇదీ..ఇండియ‌న్ ఆర్మీ స‌త్తా!!

32, 87,263 కిలోమీట‌ర్ల భౌగోళిక విస్తీర్ణం. 7000 కి.మీ స‌ముద్ర‌పు స‌రిహ‌ద్దు. 13,888 విదేశీ స‌రిహ‌ద్దులు. 14,500 కి.మీ జ‌ల‌తీరాలు. 61,000,000,000 డాల‌ర్ల విలువైన ర‌క్ష‌ణ బ‌డ్జెట్‌. 129 కోట్ల 68ల‌క్ష‌ల 34,042 ప్ర‌జ‌లు. ఇదీ న‌వీన భార‌త‌దేశ స్వ‌రూపం. ఆధ్యాత్మిక‌.. దార్మిక‌త‌.. ధైర్య‌సాహ‌సాలు.. శాంతిమంత్రాలు.. అహింస‌కు క‌ట్టుబ‌డే జీవ‌న విధానం. స‌మైఖ్య‌భార‌తానికి నిదర్శ‌నం. అటువంటి భార‌త‌దేశం.. ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా మారబోతుంద‌నేది కూడా జ‌గ‌మెరిగిన స‌త్యం. ముఖ్యంగా పశ్చిమాసియాలో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గ‌టాన్ని మిత్ర‌దేశాలు మెచ్చుకుంటున్నాయి. వైరిదేశాలు కుళ్లుకుంటున్నాయి. గాల్వాన్‌లోయ‌లో పాగా వేసేందుకు కుట్ర‌ప‌న్ని చైనా కూడా భార‌త్ స‌రిహ‌ద్దుల‌ను వీలైనంత లాక్కోవాల‌నే చూస్తుంది. దాదాపు 65 రోజుల పాటు మెక్‌మోహ‌న్‌రేఖ వ‌ద్ద జ‌రిగిన గొడ‌వ‌లో క‌ర్న‌ల్ సంతోష్‌బాబుతో స‌హా 20 మంది సైనికులు అమ‌రులయ్యారు.

ఆ త‌రువాత భార‌త్ కూడా చాణక్య‌నీతిని ప్ర‌ద‌ర్శించింది. ఆర్ధికంగా, దౌత్య‌ప‌రంగా యుద్ధం ప్రారంభించింది. చైనా మ్యాప్‌లు మార్చితే.. బార‌త్ యాప్‌లు నిషేధించింది. చిన్న శాంపిల్‌కే వ‌ణ‌కిన చైనా.. చివ‌ర‌కు మేం స‌రిహ‌ద్దుకు 2 కిలోమీట‌ర్ల అవ‌త‌ల‌కు జ‌రిగామంటూ సంధికి వ‌చ్చింది. కానీ.. ఇండియా మాత్రం 1962లో ఇదే మాదిరిగా చైనా శాంతి వ‌ల్లెవేస్తూ.. వెనుక‌చాటున దాడిచేయ‌టాన్ని గుర్తు చేసుకుంటుంది. పాక్‌, చైనా, నేపాల్‌, బంగ్లాదేశ్ న‌లువైపులా భార‌త్‌పై యుద్ధం చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నా.. అజేయ‌మైన భార‌తీయ సైనిక‌శ‌క్తి ఆ నాలుగు దేశాల‌కూ వ‌ణ‌కు పుట్టిస్తుంది. ఇది స‌ర‌దాగా.. ఎమోష‌న్‌గా చెబుతున్న మాట కాదు.. 2020లో అంత‌ర్జాతీయంగా 136 దేశాల సైనిక‌శ‌క్తి గురించి గ్లోబ‌ల్ ఫైర్ ఫ‌వ‌ర్ అనే సంస్థ నిగ్గుతేల్చిన వాస్త‌వాలు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైనిక‌శ‌క్తిలో టాప్‌05లో భార‌త్ 4వ స్థానంలో ఉందని తేల్చింది. సైనిక ప‌రంగానే కాదు..

ఆయుధ‌ప‌రంగా కూడా చైనాకు ఏ మాత్రం త‌క్కువ‌కాద‌ని తేల్చింది. యుద్ధట్యాంకులు, ప‌దాతిద‌ళం విష‌యంలో భార‌త్ పై చేయి కావ‌టం విశేష‌మ‌నే చెప్పాలి. అమెరికా, ర‌ష్యా, చైనా, ఇండియా, జ‌పాన్ వ‌రుస‌గా ఐదు స్థానాల్లో ఉంటే.. పాకిస్తాన్‌ది 15వ స్థానం. ఇండియ‌న్ ఆర్మీలో 35,44,000 మంది సైనికులున్నారు. వీరిలో ఇప్ప‌టికిప్పుడు రంగంలోకి దిగేవారు 14,44,000 కాగా రిజ‌ర్వ్‌డ్‌గా ఉన్న సైనికులు 21 ల‌క్ష‌లు. యుద్ధ‌విమానాలు 2123, ఫైట‌ర్స్ 538, హెలికాప్ట‌ర్లు 722, ఎటాక్ హెలికాప్ట‌ర్లు 23, ట్యాంకులు 4292, శ‌త‌ఘ్నులు 8626, రాకెట్ ప్ర‌యోగించేవి 266, నావీకాద‌ళంలో 285 యుద్ధనౌక‌లు. ఎయిర్ క్రాఫ్ట్ 01, స‌బ్ మెరైన్లు 16 ఇలా.. చాలా వ‌ర‌కూ అధునాత‌న ఆయుధ సామాగ్రి రెఢీగా ఉంది. చైనా, పాకిస్తాన్ ఏ ఒక్క శ‌త్రుదేశ‌మైనా భార‌త సార్వ‌భౌమాధికారాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తే రెప్ప‌పాటులో తిప్పికొట్టేందుకు దాదాపు.. అన్ని ర‌కాలుగా భార‌త్ వాయు, నౌకా, ప‌దాతి ద‌ళాల‌ను సిద్ధం చేసింది. మీరు ఒక్క బాంబు వేసినా.. ఒక్క మిస్సైల్ ప్ర‌యోగించినా.. మా నుంచి ప‌దుల సంఖ్య‌లో వ‌స్తాయ‌నే సంకేతాలు.. మొన్న న‌రేంద్ర‌మోదీ స‌రిహ‌ద్దు ప‌ర్య‌ట‌న‌తో వైరివ‌ర్గాల‌కు అర్ధ‌మైన‌ట్టుంది. అందుకే.. చైనా.. కాళ్ల‌బేరాల‌కు వ‌చ్చింది.. అయినా జిత్తుల‌మారి చైనా మాట‌ల‌ను భార‌త్ న‌మ్మ‌ట్లేదు. స‌రిహ‌ద్దుల బ‌ల‌గాల‌ను య‌ధావిధిగా ఉంచుతుంది. మ‌రో ఏడాదిపాటు ఇదే స్థితిని కొన‌సాగించేందుకు అనువుగా సైనికుల‌ను సిద్ధంచేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.