FbTelugu

అక్కడ బాగాలేదా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, అధికారుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇక సాధారణ జనం సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో పాలకవర్గాలపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ జనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అష్టకష్టాలు పడుతున్నారని, కరోనా బాధితులకు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఏపీకి చెందిన ఓ డిప్యూటీ సీఎం ఏకంగా ఆ రాష్ట్రాన్నే కాదని హైదరాబాద్‌కు కరోనా చికిత్స కోసం వచ్చారు. దీంతో ఏపీలో కరోనా చికిత్సపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోకెల్లా ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకెక్కింది. బాధితులను కాపాడేందుకు వారికి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, మెరుగైన చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందిస్తున్నామని సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చెబుతున్నారు. దీంతో సాధారణ జనం కూడా నిజమేనని నమ్మారు.

కానీ, ఈ నమ్మకాన్ని వమ్ముచేసేలా డిప్యూటీ సీఎం నిర్ణయం ఉందన్న విమర్శలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఇటీవల డాక్టర్లు కొవిడ్‌ పరీక్ష నిర్వహించారు. దీంతో వారికి పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. కానీ, అక్కడ ఏమైందో తెలియదు. కానీ, తాను కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌కు వెళుతున్నానని, అక్కడే చికిత్స పొందుతున్నానని కలెక్టర్‌కు సమాచారమిచ్చి హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎంకు తమ పార్టీ పాలనపై నమ్మకం లేకనే ఏపీకి వెళ్లాడని, ఏపీలో కరోనా నియంత్రణకు కనీస సౌకర్యాలు కూడా లేవన్న విషయం బయటపడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.