FbTelugu

నమ్ముకున్నళ్లే నట్టేట ముంచుతున్నారా..!

తెలుగు రాష్ట్రాల్లో అంబటి రాంబాబు పేరు వినని వారున్నారంటే నమ్మడం కష్టమే. ఆయన మొదటి నుంచీ వైస్‌ రాజశేఖర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన మరణానంతరం వైఎస్‌ఆర్‌ కుమారుడు జగన్‌ పక్కనే ఉండి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మొదటి నుంచీ వైఎస్‌ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉండడంతో పాటు జగన్‌ పార్టీ పెట్టి చంద్రబాబుకు పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టడంలోనూ అంబటిది ప్రధాన పాత్రే. చంద్రబాబు పాలనను ఎండగట్టడంలోనూ, వైసీపీ, జగన్‌ గురించి ప్రజలకు వివరించడంలోనూ అంబటి ప్రధాన పాత్రనే పోషించారు. ఇలాంటి వ్యక్తికి వైసీపీ పార్టీలో, జగన్‌ ప్రభుత్వంలో మంచి అవకాశాలే ఉంటాయని ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా భావించాయి. కానీ, అంబటికి ప్రభుత్వంలో కీలక అవకాశాలేమీ రాకపోగా ఇప్పుడు పార్టీలో కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదట.

ఇప్పుడు పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయన్న వార్త కూడా గుప్పుమంటోంది. అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత, మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు, కానీ అలాంటిది ఏమి ఆయనకు రాలేదు. అయినాసరే దాని గురించి ఎప్పుడు ఆయన బహిరంగంగా బాధ పడిన సందర్భాలు లేవు. ఎప్పటికప్పుడు వైసీపీ తరుపున బలమైన వాణి వినిపించే నేతగా పేరుపొందిన అంబటికి సొంత సర్కార్‌ నుండి ఒక రకమైన షాక్‌ తగిలిందన్న బాధలో ఉన్నారట ఆయన. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో అంబటి రాంబాబు ఊహించని అఫిడవిట్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. దర్యాప్తు కోసం కమిటీ వేశామని .. అక్రమ మైనింగ్‌ జరిగిందని గుర్తించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ వాదిస్తూ వచ్చింది. హఠాత్తుగా దర్యాప్తు కమిటీ వేశామని అక్రమ మైనింగ్‌ నిజమేనని ప్రభుత్వం చెప్పడంతో అంబటి రాంబాబుకు షాక్‌ తగిలినట్లయింది. ఈ కేసు మెల్లగా అంబటి రాంబాబు వైపు వస్తుందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా అక్రమ మైనింగ్‌ జరుగుతోంది అంబటి రాంబాబు అండతోనేనని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇదే కనుక జరిగితే అంబటికి ఇబ్బందులు తప్పవు అని తెలుస్తుంది. సొంత పార్టీ నుండే అంబటి రాంబాబుకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం పట్ల రాజకీయ లక్ష్యాలు వేరే ఉన్నట్లు తెలుస్తుంది. భవిష్యత్‌లో అంబటి రాంబాబు ఎలాంటి తోక జాడించకుండా ఉండేందుకు ఈ కేసును గుప్పిట్లో పెట్టుకునేందుకు వైసీపీ పెద్దలు .. హైకోర్టుకు అక్రమ మైనింగ్‌ జరిగిందని అఫిడవిట్‌ ఇచ్చారని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు అయితే జగన్‌ కు భజన తప్ప, వ్యతిరేకంగా ఒక్క మాటకూడా మాట్లాడలేదు అంబటి రాంబాబు, అలాంటిది ఆయనకు ఉచ్చు బిగించటం ఏమిటో అర్ధం కావటం లేదంటున్నారు అంబటి అనుచరులు. మొత్తానికి తమ ప్రభుత్వం వస్తే తనకు ఎన్నో అవకాశాలు ఉంటాయని ఆశపడిన అంబటికి తమ ప్రభుత్వమే తనను వేధించే స్థాయికి వస్తుందని బహుషా అంబటి రాంబాబు ఎన్నడూ ఊహించి ఉండరు. ఆయన బాధను చూసిన కార్యకర్తలు మాత్రం పాపం రాంబాబు అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.