FbTelugu

తెలుగు త‌మ్ముళ్ల‌కు కేసుల గుబులు!

అచ్చెన్న అంత‌టి నేత‌నే జైల్లో ప‌డేశారు. ఫైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకుని ర‌క్తం కారుతున్నా వ‌ద‌ల్లేదు. పైగా స‌రిగా స‌హ‌క‌రించ‌ట్లేదంటూ ఏసీబీ అధికారుల మాట‌తో కోర్టు కూడా బెయిల్ నిరాక‌రించింది. సీమ‌లో తొడ‌కొట్టి నాకేటీ.. న‌న్నేవ‌రు చేయ‌లేరంటూ డాంభికాలు పోయే.. జేసీ బ్ర‌ద‌ర్స్ కూడా కేసుల దెబ్బ‌కు చుక్క‌లు చూస్తున్నారు.

ప‌దేళ్ల‌నాటి పాపాల చిట్టా బ‌య‌ట‌కు తీసి మ‌రీ చ‌ట్టంతో కొడుతున్నారు. మాజీ మంత్రులు చింత‌కాయ‌ల, చిన‌రాజ‌ప్ప‌లు పెళ్లికి వెళ్లినందుకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. హైకోర్టు పుణ్య‌మాంటూ చింత‌కాయ‌ల అరెస్టు నుంచి త‌ప్పించుకున్నాడు. అక్క‌డ ఏ మాత్రం తేడాకొట్టినా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ప‌రామ‌ర్శ‌ల‌కు ఎవ‌రొస్తారా! అని దిక్కులు చూడాల్సి వ‌చ్చేది. మంత్రి పేర్నినాని అనుచ‌రుడు భాస్క‌ర‌రావు హ‌త్య కేసులో కీల‌క నిందితుడుగా మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర అరెస్టు. రాజ‌కీయంగా ఇది మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీసీలు మాకు దేవుళ్లంటూ గీరాలు ప‌లికే టీడీపీ నాయ‌కుడు ఒక బీసీ నేత‌ను హ‌త్య చేయించ‌టం ప‌సుపు గూటిలో కాస్త ఇబ్బందిగా మారింది. అచ్చెన్న అరెస్టును బీసీల‌కు చుట్టిన నేత‌లు.. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి.

క‌ర్నూలులో భూమా కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌సులకూ కేసుల బాధ త‌ప్ప‌లేదు. దీంతో బీజేపీ పంచ‌న చేరి ప్రాణాలు ద‌క్కించుకున్న టీడీపీ నేత‌లు మాత్రం.. వైసీపీ త‌మ వైపు కూడా క‌న్నేస్తే ప‌రిస్థితి ఏమిటా! అని దిక్కులు చూస్తున్నార‌ట‌. మొన్నీ మ‌ధ్య సోష‌ల్ మీడియాపై దృష్టిపెట్టిన సీఐడీ ఏకంగా ల‌క్ష‌ల మందిని గుర్తించి కేసులు పెట్టే ప‌నిలో ఉంద‌ట‌. ఇలా.. ఏడాది క్రితం వ‌ర‌కూ చుట్టూ మందీమార్భ‌లంతో హ‌వా న‌డిపించిన నేత‌లు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. క‌నుసైగ‌తో అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు తీయించిన తెలుగు దేశం నేత‌లు ఇప్పుడు.. ఎటువైపు నుంచి ముప్పు వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పేద్ద నేత‌ల ప‌రిస్థితే ఇలా ఉంటే.. స‌గ‌టు కార్య‌కర్త‌ల ప‌రిస్థితి ఏమిట‌నేది మ‌రో సందేహం. దీంతో చాలామంది టీడీపీ నాయ‌కులు.. వ్యాపారాలు, ఉద్యోగాల పేరు చెప్పి బిచాణా ఎత్తేస్తున్నారు. 2024 నాటి ఎన్నిక‌ల‌కు సొంత‌గూటికి చేర‌దామ‌నే ఉద్దేశంతో కుటుంబంతో క‌ల‌సి వ‌ల‌స పోతున్నార‌ట‌. ఓ విధంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారికి వైసీపీ ప్ర‌భుత్వం చేప‌డ‌తున్న చ‌ర్య‌లు హెచ్చ‌రిక‌గా .. విప‌క్షాల‌కు ఉలికిపాటుగా మారాయ‌న్న‌మాట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.