FbTelugu

త‌మ్మినేనికి అధ్య‌క్షా అని పిల‌వాలని ఉంద‌ట‌!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక కొర‌త వేధిస్తుంద‌ట‌. దాన్ని ఎవ‌రు తీర్చుతార‌నేది అర్ధం కావ‌ట్లేదట‌. ఏమిటా స‌మ‌స్య అనేగా! మీ అనుమానం.. ఫైర్‌బ్రాండ్‌. అదేమిటీ.. ఒక అనిల్‌కుమార్ యాద‌వ్‌.. ఒక బుగ్గ‌న‌.. ఒక‌.. ఇలా చాలా మంది ఉన్నారు. పైగా బూతుల పంచాంగంలో త‌న‌కు తానే చాటి అని చాటుకునే కొడాలి నాని ఉండ‌నే ఉన్నాడు క‌దా అనుకునేవారు. ఈ మ‌ధ్య వాళ్లంతా కాస్త మ‌ర్యాద నేర్చుకున్నారు. ఎలాప‌డితే అలా మాట్లాడ‌టాన్ని త‌గ్గించారు. ముఖ్యంగా మంత్రివ‌ర్యులు కొడాలి.. భాష‌లో చాలా మార్పు వ‌చ్చింది. అస్స‌లు మీడియాలో క‌నిపించ‌టం లేదు కూడా. అయినా.. ఆంధ్రాలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాట‌కు ముందుకు.. ఒక డ్యాష్‌. మాట త‌రువాత మ‌రో డ్యాష్ సారీ.. బూతుల వాడ‌కం అల‌వాటుగా మారింది. తాత‌ల నుంచి వ‌చ్చిన అల‌వాటు ప్ర‌స్తుతం నేత‌ల‌కు గ్ర‌హ‌పాటుగా మారింది. అందుకే.. ఇప్పుడు వైసీపీ త‌ర‌పున మైక్ ప‌ట్టుకుని అవ‌త‌లి పార్టీ నేత‌ల‌ను దుమ్మ‌దులిపే నాయ‌కుడు కావాలంటే.. ఆ జాబితాలో మ‌న ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌రైనోడ‌ని గుర్తించార‌ట‌.

అందుకే.. ఈ సారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ్మినేనికి ఛాన్స్ ఇవ్వాల‌ని పార్టీ అధినేత భావిస్తున్నార‌ట‌. ఇక్క‌డ మ‌రో సెంటిమెంట్ కూడా ఉంది. ఏపీ, తెలంగాణ‌.. ఎక్క‌డైనా స‌రే శాస‌న‌సభ స్పీక‌ర్‌గా ఐదేళ్లు చేసిన వారికి త‌రువాత రాజ‌కీయాలు క‌ల‌సిరావ‌ట్లేద‌నే సెంటిమెంట్ ప‌డిపోయింది. 2014-19 వ‌ర‌కూ ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా చేసిన కోడెల ఎంత‌టి దారుణ ప‌రిస్థితులు ఎదుర్కొన్నార‌నేది నిలువెత్తు సాక్ష్యం.. ఇంటా బ‌య‌టా ఒత్తిళ్లు భ‌రించ‌లేక బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి ప‌ద‌విలో ఉన్న‌పుడు ఎంత‌గా చ‌క్రం తిప్పార‌నేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కానీ.. ఆ త‌రువాత రాజ‌కీయంగా చీక‌టి దిశ అనుభ‌విస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ చుట్టూ ఉన్న మందీమార్బ‌లం ఎవ్వ‌రూ లేరు. అందుకే.. త‌మ్మినేని దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి.. స్పీక‌ర్‌గా ఐదేళ్ల‌పాటు కొన‌సాగేందుకు విముఖంగా ఉన్నార‌ట‌. అందుకే.. జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకుని ఏదో విధంగా మంత్రిగా అసెంబ్లీలో అధ్య‌క్షా అని పిల‌వాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టుగా.. ఫైర్‌బ్రాండ్‌గా ప్ర‌త్య‌ర్థుల‌పై చెల‌రేగుతారు.. మంత్రి కావాల‌నే ఆశ‌ను తీర్చిన‌ట్టు అవుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయ‌ట‌

You might also like

Leave A Reply

Your email address will not be published.