FbTelugu

అమ‌రావ‌తి గ‌తి  ఇంతేనా!

35 వేల ఎక‌రాలు.. 6వేల కోట్ల‌రూపాయ‌లు. ప్ర‌జాధ‌నంతో నిర్మించిన క‌ట్ట‌డాలు. అమ‌రావ‌తి రాజ‌దానిగా చేస్తూ టీడీపీ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చులు. మ‌రి ఐదేళ్ల త‌రువాత అదంతా తూచ్ అంటూ వైసీపీ ప్ర‌భుత్వం మోకాలొడ్డుతుంది. ఇదంతా కేవ‌లం అమ‌రావ‌తిలో ఉన్న సామాజిక‌వ‌ర్గంపై క‌క్ష‌సాధింపా.. లేక‌పోతే చంద్ర‌బాబు పునాది వేసిన చోట తాను ఎందుకు ఉండాల‌నే అభిప్రాయ‌మా అనేది ఇప్ప‌టికీ అర్ధంకాని ప్ర‌శ్న‌గానే మిగిలింది. అస‌లు ఇంత‌కీ.. ఏపీ స‌ర్కారు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న వెనుక అస‌లు వాస్త‌వాలు ఏమిటీ. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకృతం చేయ‌కుండా రాష్ట్రం న‌లువైపులా విస్త‌రించాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్ట‌యితే ఏపీ ప్ర‌జ‌లు జై కొడ‌తారు. లేద‌నుకుంటే.. టీడీపీకు ఎదురైన అనుభ‌వ‌మే 2024లో అధికార పార్టీ చ‌విచూడాల్సి ఉంటుంద‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. ఏమైనా ఇప్పుడు మ‌రోసారి రాజ‌ధాని అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.

జ‌గ‌న్ మాత్రం.. త‌న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డిన‌ట్టుగానే.. క‌ర్నూలు, విశాఖ‌, అమ‌రావ‌తి మూడు రాజ‌ధానులు ప‌క్కా అంటున్నారు. దీనిలో భాగంగానే మొన్నీ మ‌ద్య విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన డీజీపీ గౌత‌మ్ న‌వాంగ్ అక్క‌డ శాంతిభ‌ద్ర‌తల ప‌రిస్థితి అంచ‌నా వేశారు. న‌క్స‌ల్స్ చ‌ర్య‌ల గురించి వాక‌బు చేశారు. ఏవోబీ స‌మీపంలో ఏపీ పోలీసులు ఎంత వ‌ర‌కూ అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌నే దానిపై కూడా స‌మీక్ష జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. ఎటుచూసినా.. శ్రావ‌ణ‌మాసంలో ఇళ్ల‌స్థ‌లాల పంపిణీతోపాటు.. ఏపీ సొంత‌గూటిగా భావించే విశాఖ‌కు త‌ర‌లిపోనుంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. మ‌రోవైపు అమ‌రావ‌తిలో 29 గ్రామాల రైతులు, ప్ర‌జ‌లు 200 రోజుల‌కు పైగా దీక్ష చేస్తూనే ఉన్నారు. ప‌వ‌న్‌కూడా దీనికి మ‌ద్ద‌తు ప‌లికారు. శాస‌న‌స‌భ‌ల‌కు మాత్ర‌మే అమ‌రావ‌తిని కేటాయించ‌టం మంచిదికాదంటున్నారు. ఏమైనా… అటు విశాఖ‌పై అభిమానం.. ఇటు సీమ‌పై మ‌మ‌కారం.. అమ‌రావ‌తిపై అనురాగంతో మూడు రాజధానులు దాదాపు ఖాయ‌మైన‌ట్టే. ఎన్ని దీక్ష‌లు చేసిన ఎంత‌మంది సుజ‌నాచౌద‌ర్లు.. మ‌రెంత మంది ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు చేతులు  అడ్డుపెట్టినా సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం మాత్రం సుస్ప‌ష్టం అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఏపీ ప్ర‌జ‌ల్లో కూడా రాజ‌ధానుల అంశంపై అనుకున్నంత వ్య‌తిరేక‌త రాలేదు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో రాజ‌ధాని రావ‌టం వ‌ల్ల కాలుష్యం, జ‌నాభా పెరుగుతుంద‌నే ఆందోళ‌న మాత్ర‌మే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో ఉంద‌ట‌. ఏమైనా ప్ర‌శాంత సాగ‌ర‌తీరం.. రాజకీయాల‌తో హోరెత్త‌నుంద‌న్న‌మాట మాత్రం ముమ్మాటికీ నిజ‌మే.

You might also like

Leave A Reply

Your email address will not be published.