FbTelugu

‘పోతిరెడ్డిపాడు’పై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీంను నిలిపి, టెండర్ల ప్రక్రియలో ముందుకు పోకుండా నిరోధించడానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో పలు అంశాలను లేవనెత్తింది.

సమైక్యరాష్ట్రంలోనే నీటివాటా విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఈ అంశాన్ని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇప్పటికే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కిందకు వస్తుంది. ఏపీ కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే డీపీఆర్ లు సమర్పించాలని, విధిగా అనుమతులు పొందాలని పేర్కొంది.

You might also like