FbTelugu

శారదా పీఠంలో స్పీకర్, టీటీడీ ఛైర్మన్

విశాఖపట్నం: పెందుర్తి మండలం చిన్నమూషివాడ శారదా పీఠంలో వార్షికోత్సవ వేడుకలు భాగంగా ఈ రోజు చివరి రోజు పూర్ణ హారతి కార్యక్రమం జరిగింది.
ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున ప్రారంభమయ్యే ఈ వార్షికోత్సవాలు వేడుకలు ఐదు రోజుల పాటు జరుగుతాయి.

ఈ సంవత్సరం ఈనెల 17వ తేదీన భీష్మ ఏకాదశి రోజున ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిరోజు అతిథిగా పాల్గొన్నారు. రాజశ్యామల యాగం కూడా చేశారు. ఇవ్వాల్టి పూర్ణ హారతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతం పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.