FbTelugu

పొలాల్లోకి దూసుకెళ్లిన స్పీకర్ కారు

శ్రీకాకుళం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ సీతారాం బుల్లెట్ ఫ్రూప్ వాహనం ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస, వంజంగి గ్రామాల మద్య పాలకొండ రోడ్డు పై వాహన ప్రమాదం చోటు చేసుకున్నది.

శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వస్తుండగా స్పీకర్ కాన్వాయి లోకి ఆటో చొరబడి కారును ఢీ కొన్నది. ఆటోను తప్పించే ప్రయత్నంలో పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో బోల్తా పడ్డ ఆటోలోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి స్పీకర్ దగ్గరవుండి తరలించారు. వేరే ప్రత్యామ్నాయ వాహనంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిపోయారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.