FbTelugu

అంతరిక్ష యాత్ర టికెట్ ధర రూ.203 కోట్లు

వాషింగ్టన్: అంతరిక్ష యానం కోసం స్పేస్ ఎక్స్ తో బ్లూ ఆరిజన్ సంస్థలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మానవులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు బ్లూ ఆరిజన్ సంస్థ తొలి టికెట్ ను వేలానికి పెట్టింది. ఈ యాత్ర విజయవంతమైతే అంగారక గ్రహం మీద రెసిడెన్షియల్ కాలనీలు రానున్నాయి.

అమెజాన్ సంస్థ యజమాని జెఫ్ బెజోస్ అంతరిక్ష యానం కోసం బ్లూ ఆరిజన్ ఏర్పాటు చేశారు. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర లో వ్యోమగాములతో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్ బెజోస్ ప్రయాణించనున్నారు. మరో సీటు ఖాళీగా ఉండడంతో శనివారం నాడు వేలం నిర్వహించారు. ప్రత్యక్ష వేలం ప్రారంభించిన నాలుగు నిమిషాలకే ఒక వ్యక్తి 20 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు బిడ్ వేశాడు. ఏడు నిమిషాల తరువాత ఒకరు 28 మిలియన్ డాలర్లు (రూ.205 కోట్లు) చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. ఇక ఆ తరువాత ఎవరూ ముందుకు రాకపోవడంతో రూ.205 కోట్లు చెల్లించిన వ్యక్తి కి సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన వివరాలు మాత్రం ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ వేలం పాటలో 143 దేశాలకు చెందిన 6వేల మంది పాల్గొన్నారు. వచ్చే నెల జూలై 20వ తేదీన వెస్ట్ టెక్సాస్ నుంచి బ్లూ ఆరిజన్ కు చెందిన న్యూ షెప్టర్ బూస్టర్ అంతరిక్షయానం మొదలు పెడుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.