FbTelugu

యుపి పంచాయతీ ఎన్నికల్లో ఎస్పి దూకుడు

లక్నో: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, అయోధ్యలో సమాజ్ వాదీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు.

గ్రామ పంచాయతీ, గ్రామ ప్రధాన్, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీ నాలుగంచేల వ్యవస్థకు ఏప్రిల్ 29వ తేదీ వరకు నిర్వహించారు. రామాలయం నిర్మించే అయోధ్యలో 40 పంచాయతీ స్థానాలు ఉండగా, బిజెపి కేవలం ఆరింటిలో మాత్రమే గెలుపొందింది. సమాజ్ వాదీ 24 స్థానాలు, బిఎస్పి ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వారణాసి జిల్లాలో బిజెపి ఏడు స్థానాల్లో విజయం సాధించగా సమాజ్ వాదీ 15 స్థానాలు గెలుపొందింది. ఆప్ పార్టీ రాష్ట్రంలో 70 స్థానాల్లో గెలుపొందడం విశేషం. జిల్లా పంచాయతీల్లో సగానికి పైగా ఎస్పి గెలుపొందినా గెలుపు పత్రాలు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పంచాయతీ ఎన్నికలు సాధారణంగా పార్టీ రహితంగా జరుగుతాయి కాని ఆయా అభ్యర్థులకు పార్టీలు మద్దతు పలుకుతుంటాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.