FbTelugu

కర్ణాటకను రేపు తాకనున్న నైరుతీ రుతుపవనాలు

బెంగళూరు: నైరుతీ రుతుపవనాలు గురువారం కర్ణాటకలో ప్రవేశించనున్నట్లు వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. రుతుపవనాలతో పాటు అరేబియా సముద్రంలో ఈదురుగాలలు ప్రభావం ఉందని పేర్కొన్నారు.
పలితంగా మరో రెండు రోజుల పాటు వర్షం కురుస్తుందని, కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఈ నెల 3వ తేదీన కేరళ మార్గంగా రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల మీదుగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురవనున్నాయి. సోమవారం నాడు పలు ప్రాంతాల్లో ఒక సెంటిమీటర్ నుంచి 7 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసింది. సుళ్య, కుందాపుర, కుక్కె సుబ్రహ్మణ్య, చిక్కమంగళూరు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.