FbTelugu

మరో 48 గంటల్లో తెలంగాణలోకి నైరుతి

హైదరాబాద్: వచ్చే రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. వారం రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా వ్యాపించనున్నాయని తెలిపింది.

కాగా ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వ్యాపించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.