FbTelugu

కరోనా ఆ నటీమణి మాదిరే ఉంది కదూ..!

చెన్నై: తమిళనాడులో కరోనా దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విగ్రహం రూపు రేఖలు అచ్చం నటీమణి వనితా విజయ్ కుమార్ మాదిరే ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.

కోయంబత్తూర్ సమీపంలో పూజారులు కరోనా దేవత విగ్రహం ప్రతిష్టించడమే కాకుండా మహమ్మారి పీడ వదలాలంటూ 40 రోజుల పూజకు శ్రీకారం చుట్టారు. దీంతో కరోనా దేవత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన కొందరు అచ్చు వనితా విజయ్ కుమార్ మాదిరే ఉందంటూ కామెంట్లు పెట్టారు. అంతటితో ఆగకుండా రెండు ఫొటోలను జత చేసి సెటైర్లు వేస్తున్నారు. ఈ ఫొటోలను ఆమెకే షేర్ చేస్తుండడం కొసమెరుపు. వనితా విజయ్ కుమార్ మీమ్స్ తమిళనాడు లో వైరల్ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.