FbTelugu

త్వరలో జీయో 5జీ ఎకోసిస్టమ్: ముఖేశ్

ముంబై: దేశ ప్రజలకు త్వరలోనే 5జీ ఎకో సిస్టమ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు.
ముంబైలో బుధవారం జరిగిన రిలయన్స్ షేర్ హోల్డర్ల సమావేశంలో ముఖేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జియో ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. దేశంలో ఇంకా 2జీ మొబైల్ వినియోగదారులు ఉన్నారని, జియో 10 కోట్ల మంది వినియోగదారులను 2జీ నుంచి 4జీ సేవల వైపు మళ్లించిందన్నారు.
అయినా ఇప్పటికి లక్షలాది మంది వినియోగదారులు 2జీ సేవలనే వినియోగిస్తున్నారన్నారు. ప్రస్తుతం జియో లో 38 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

You might also like