దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సొంత ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మంది వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో సాయం చేసి వారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
అయితే పేదలకు సాయం చేసేందుకు తన ఆస్తులను తాకట్టు పెట్టినట్టుగా సమాచారం. ముంబయిలో తన భార్య సోనాలికి చెందిన రూ.10 కోట్ల విలువ చేసే ఆరు ఫ్లాట్లను, 2 దుకాణాలను తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. నవంబరు 24న తాకట్టు ఒప్పందం రిజిస్టర్ చేశాడంటూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.