FbTelugu

సోనూసూద్ కు కరోనా నెగెటివ్

ముంబయి: ప్రముఖ నటుడు, కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూసూద్ కరోనా పాజిటివ్ తగ్గింది. టెస్టు రిపోర్టులో నెగెటివ్ నిర్థారణ అయ్యినట్లు ఆయన ప్రకటించారు.

ఈ నెల 17వ తేదీన తనకు కరోనా పాజిటివ్ సోకిందని సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు మేరకు హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. తగిన జాగ్రత్తలు పాటించడంతో త్వరగా కోలుకున్నారు. శుక్రవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. గతేడాది లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు, విద్యార్థులు వారి స్వంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా తరలించి ఉదారతను చాటుకున్నారను. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను సైతం స్వదేశానికి విమానాల్లో తీసుకువచ్చి అందరిచేత మన్ననలు పొందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.