FbTelugu

బాధితులకు సోనూసూద్ స్పెషల్ ఫ్లైట్స్

ముంబై: ఫిలిప్పీన్స్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో విమానం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావంతో ఫిలిప్పీన్స్ లో భారతీయులు చిక్కుకుపోయారు.

అక్కడున్న వారిని రప్పించేందుకు ఇప్పటికే ఓ విమానం ఏర్పాటు చేశాడు. సరిపోకపోవడంతో ఆగస్టు 14న రెండో విమానం సమకూర్చాడు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనుంది. ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. సోనూసూద్ తన దాతృత్వానికి పరిమితులు లేవని చాటుకుంటూనే ఉన్నారు.
కాగా, కజికిస్థాన్ లో చిక్కుకున్న వారి కోసం కూడా సోనూ ఓ విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం కూడా ఆగస్టు 14న బయల్దేరనుంది.

You might also like