FbTelugu

కెటిఆర్ అంటే ఎంతో గౌరవం: సోనూసూద్

హైదరాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అంటే తనకెంతో ఇష్టమని నటుడు సోనూసూద్ కొనియాడారు. ఇవాళ మంత్రి కెటిఆర్ ను సిఎం క్యాంప్ కార్యాలయంలో సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

సోనూసూద్ కరోనా ప్రారంభవం నుంచి ఎంతో మందికి సాయం చేశారని, పేదలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారని కెటిఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్ది సేపు చర్చించుకున్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కంపెనీలు రావడానికి కెటిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని సోనూ కొనియాడారు. కెటిఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని, కష్ట సమయాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారన్నారు. సోనూసూద్ గౌరవార్థం కెటిఆర్ ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.