FbTelugu

కరోనా మృతులకు సోనూసూద్ చేయూత

ముంబై: కరోనా పాజిటివ్ బారిన పడి మృతిచెందిన పేదలు, కూలీల కుటుంబాలను ఆదుకోవాలని నటుడు సోనూ సూద్ నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివరాలు సేకరిస్తున్నాడు.

లాక్ డౌన్ సందర్భంగా స్రగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను పెద్ద ఎత్తున ఆదుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాలు నడిపించిన సోనూ సూద్ ఆదుకునేందుకు మరో అడుగు ముందుకు వేశారు.

సాయం అందించేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన అధికారులతో మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని సోనూసూద్ ప్రకటించారు.

You might also like