FbTelugu

కార్మికులను రైళ్లలో పంపిస్తున్న సోనూ

వలస కూలీల కోసం టోల్ ఫ్రీ నెంబర్

ముంబయి: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపిస్తున్నా వారి ఆవేదన ఇంకా తీరడం లేదు.

కేంద్ర ప్రభుత్వ విధానం పై నమ్మకం లేకనో ఏమో… బాలీవుడు నటుడు సోనూ సూద్ నే నమ్ముకుంటున్నారు. కూలీలను స్వగ్రామాలన చేర్చేందుకు బస్సులు, విమనాలు ఏర్పాటుచేసిన సోనూ సూద్ తాజాగా ప్రత్యేక రైళ్ల ద్వారా సేవలందిస్తున్నారు. ప్రతిఒక్కరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఆయన ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు.

టోల్ ప్రీ నెంబర్ కు ఫోన్ చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరి కోసం మూడు ప్రత్యేక రైళ్లు బుక్ చేసి స్వంత ప్రాంతాలకు పంపించారు. యూపీ, బిహార్ వలస కార్మికులు ముంబై లో అధికంగా ఉంటున్నారు. వీరి కోసం ఈ మూడు రైళ్లు పంపించారు. వలస కార్మికుల వెతలపై సోనూ సూద్ మాట్లాడుతూ, బస్సులలో పంపించడం మొదలు పెట్టిన తరువాత నుంచి ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. కొందరు మెస్సేజులు పెడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే చాలామంది మమ్మల్ని సంప్రదించారు. బస్సుల్లో వలస కార్మికులను పంపించే సమయంలో ప్రతి రాష్ట్రం నుంచి అనుమతి తీసుకునే విషయంలో ఆలస్యమవుతోంది. అందుకే రైళ్లలో ఒకేసారి ఎక్కువ మందిని పంపించడానికి అవకాశముంటుంది కాబట్టి ఇటీవల మూడు రైళ్లను బుక్‌ చేసి పంపించానన్నారు. తనకు సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు సోనూ ధన్యవాదాలు  తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.