FbTelugu

సోనూపై పోలీసుల‌కు ఫిర్యాదు

* ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరిన బీఎంసీ

ముంబయి: లాక్ డౌన్ కాలంలో పేద ప్రజలను తమ సొంత ప్రాంతాలకు చేర్చి రియర్ హీరోగా పేరుతెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సోనూసూద్ పై పోలీసుకు బీఎంసీ (బ్రిహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్) ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళితే.. సోనూసూద్ త‌న ఆరు అంత‌స్తుల నివాస‌ భ‌వ‌నాన్ని అనుమ‌తులు లేకుండా హోట‌ల్ గా మార్చారని బీఎంసీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై సోనూసూద్ కి నోటీసులు పంపినప్ప‌టికీ ఆయ‌న స్పందించ‌క‌ పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించినట్టు పేర్కొంది. ఈ సందర్భంగా సోనూపై వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని కోరింది. భ‌వ‌న నిర్మాణంలో మార్పులు చేస్తూ కూడా చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మాణాలు చేప‌ట్టార‌ని తెలిపింది. 2020, అక్టోబ‌రు 7న ఒకసారి సోనూసూద్ కి మొద‌ట నోటీసులు పంపి 2020 న‌వంబ‌రు 26లోపు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించామ‌ని పేర్కొంది. మరో మారు నోటీసులిచ్చినా పట్టించుకోలేదని పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.