FbTelugu

సోనియా సలహాదారు పటేల్ ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, ఎంపీ అహ్మద్ పటేల్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఆ తరువాత ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. సందేశర గ్రూప్‌ కుంభకోణం వ్యవహారంలో అహ్మద్ పటేల్ పాత్రపై పక్కా ఆధారాలు లభించాయి. సందేశర గ్రూప్‌ వ్యవహారంలో రూ.5 వేల కోట్ల కుంభకోణం జరిగింది.
ఈడీ ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో అహ్మద్ పటేల్ సోదరులకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అహ్మద్ పటేల్ గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కాకుండా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లు తమ బలాన్ని ప్రయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు.

You might also like