FbTelugu

పీసీసీ అధ్యక్షులతో సోనియా వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధి ఈ నెల 11న(శనివారం) పీసీసీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా ప్రాంతాల్లో కరోనా సహాయక చర్యలపై చర్చించనున్నారు.

అదేవిధంగా కరోనా వ్యాప్తి పై కూడా సమాచారం అడిగి తెలుసుకోనున్నారు. భవిష్యత్ కార్యచరణ గురించి కూడా చర్చించే అవకాశం కన్పిస్తోంది. అయితే అదే రోజు ప్రధాని మోదీ కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్న విషయం తెలిసిందే.

You might also like